
విజ్ఞాన కేంద్రం.. కళల నిలయం
జహీరాబాద్ టౌన్: వేసవి సెలవులు పిల్లలకు ఆనందాన్ని పంచే అద్భుత క్షణాలు. ఈ సెలవులను ఆడుతూ.. పాడుతూ సద్వినియోగం చేసుకునేలా జహీరాబాద్ శ్రామిక విజ్ఞాన కేంద్రం, మన లైబ్రరీ నిర్వాహకులు కృషి చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి వేసవి సెలవుల్లో ఉచితంగా శిక్షణ తరగతులను నిర్వహిస్తూ పలు అంశాల్లో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వృది్‌ధ్ చేసుకునేందుకు కృషి చేస్తున్నారు. ఏప్రిల్ నెల చివరి వారంలో ప్రారంభమైన శిక్షణ శిబిరాలు మే మూడో వారం వరకు కొనసాగనున్నాయి.
శిక్షణలో ముఖ్యమైనవి
యూకేజీ నుంచి టెన్త్‌ల కోసం శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఇందులో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, గణిత నైపుణ్యం, పెయింటింగ్, డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైయిటింగ్, మట్టితో బొమ్మల తయారీ, ఫిజిల్స్ పరిష్కారం, పేపర్‌తో కళాకృతులు తయారీ తదితర అంశాలపై నిపుణులు నేర్పిస్తున్నారు.
పెరిగిన శిక్షణ కేంద్రాలు
వేసవి శిక్షణ శిబిరం కొన్నేళ్ల కిందట పట్టణంలో మాత్రమే నిర్వహించే వారు. గ్రామీణ ప్రాంత పిల్లల పట్టణానికి రాలేకపోతున్నారని. ఈ సారి గ్రామల్లో కూడా శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో 3, ఎన్‌జీవోస్ కాలనీ, మాణిక్ ప్రభు వీధి, నాగన్‌పల్లి, అల్గోల్, కుప్పానగర్, బర్దిపూర్, రంజోల్, పిప్పడ్‌పల్లిలోఒకటి చొప్పున పస్తాపూర్‌లో రెండు శిబిరాలు నడుస్తున్నాయి. వేసవి శిబిరాలకు మంచి స్పందన వస్తుంది. ప్రతీ సెంటర్ పదుల సంఖ్యలో పిల్లలు వస్తుండగా శిక్షకులు వారికి పలు విషయాలను ఆడుతూ పాడుతూ నేర్పిస్తున్నారు.
పిచరాగడి గ్రామంలోని శిబిరంలో పిల్లలు
విద్యార్థులకు ఉచిత వేసవి శిబిరాలు
జహీరాబాద్ శ్రామిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహణ
పెయింటింగ్, డ్రాయింగ్, మట్టితో బొమ్మల తయారీ వంటి వాటిల్లో తర్ఫీదు
సద్వినియోగం చేసుకోవాలి
వేసవిలో పిల్లలు సెల్‌ఫోన్‌కే పరిమితం కావడం, ఎండల్లో తిరగడం వంటివి చేస్తుంటారు. విద్యతో పాటు కళలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి, కాబట్టి కొన్నేళ్లుగా ఉచితంగా వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాం. ప్రతీ సంవత్సరం నిర్వహించే శిబిరాలకు మంచి స్పందన వస్తుంది. ఈ సారి శిక్షణ కేంద్రాలను కూడా పెంచాం. తల్లిదండ్రులు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
–డాక్టర్, శివబాబు,
శ్రామిక విజ్ఞాన వేదిక కార్యదర్శి, జహీరాబాద్