
నాణ్యమైన మందులు అందించాలి
గజ్వేల్‌రూరల్: మెడికల్ దుకాణాలకు వచ్చే ప్రజలకు నాణ్యమైన మందులు అందించి వారి మన్ననలు పొందాలని తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, మెదక్ జిల్లా అధ్యక్షుడు తొడుపునూరి రాజు పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం గజ్వేల్ ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దేవదాసు, ఉపాధ్యక్షుడిగా సంతోష్, జనరల్ సెక్రటరీగా యాదగిరి, రాజుగౌడ్‌లతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అదే విధంగా సీడీఏ జిల్లా జనరల్ సెక్రటరీగా వేముల వెంకటేశ్వర్‌రావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందించడంతోపాటు వారి మన్ననలను పొందాలని సూచించారు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా డీసీఏ సభ్యులు పాల్గొన్నారు.