జేఎస్‌ఆర్ ఔదార్యం.. చలివేంద్రం
ప్రతీ నెలా రూ.15 లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు
హుస్నాబాద్: వేసవిలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నాడు హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి. జేఎస్‌ఆర్ అన్న పేరిట 5 ఏళ్లుగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాడు. హుస్నాబాద్ పట్టణంతోపాటుగా అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండల కేంద్రాలతోపాటుగా పెద్ద గ్రామాల్లో మొత్తం 19 చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ప్రతీ చలివేంద్ర కేంద్రంలో వాటర్ ఫ్రిడ్జిని ఏర్పాటు చేసి ప్రజలకు కూల్ వాటర్‌ను అందిస్తున్నాడు. 24 గంటల పాటు కూల్ వాటర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. కరెంటు బిల్లు, వర్కర్లు, చలివేంద్రాల నిర్వాహణ దాదాపు ప్రతి నెలా రూ.15 లక్షలు ఖర్చు పెడుతున్నాడు.
జేఎస్‌ఆర్ ఔదార్యం.. చలివేంద్రం


