చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తల్లిదండ్రులు సహకారం అందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్ హాలులో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్ట్ రాష్ట్ర స్థాయి ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్ చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. బాల్యం నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచాలన్నారు. అనంతరం విజేతలకు సొంత నగదు రూ.2 లక్షలతో బహుమతులు అందజేశారు. మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహ గౌడ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అరవ రామకృష్ణ, వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు రేణుక, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.


