
చెక్‌బౌన్స్ కేసులపై లోక్ అదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర
సంగారెడ్డి టౌన్: బ్యాంకులో చెక్‌బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. జిల్లా కోర్టు కార్యాలయంలో గురువారం బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బ్యాంకు కేసులు రాజీమార్గంతో పరిష్కరించుకోవచ్చని, కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య, బ్యాంక్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.