
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
పాపన్నపేట(మెదక్): కుటుంబ సమస్యలు భరించలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు చికి త్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... కొడుపాక గ్రామానికి చెందిన అవుసుల శ్రీకాంత్ (26) నార్సింగి గ్రామంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి ఆరేళ్ల క్రితం బాచుపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 21న భార్య, అతని తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఎవరిని ఏమనలేక , బయటకు వెళ్లిన శ్రీకాంత్ పెట్రోల్ తీసుకొని వచ్చి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతన్ని మెదక్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి బానిసై ..
సంగారెడ్డి క్రైమ్: మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పట్టణ సీఐ రమేశ్ కథనం ప్రకారం... పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన మార్కంటి దేవదాసు (50), బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం మహరాష్ట్ర నుంచి పట్టణానికి వచ్చి, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య లక్మీభాయి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. బుధవారం ఉదయం భార్య లక్మీభాయి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. మధ్నాహ్యం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా దేవదాసు తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై సరిగా పని చేయడం లేదని కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో గడి ్డ మందు తాగి..
సిద్దిపేటకమాన్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గ్రీన్ కాలనీకి చెందిన నర్సింహారెడ్డి టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు. అతడు వ్యాపార నిర్వహణ కోసం అవసరాల నిమిత్తం చిట్ ఫండ్‌లలో, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక, మానసికంగా ఇబ్బంది పడుతూ టింబర్ డిపోలో మంగళవారం గడ్డి మందు తాగాడు. గమనించిన అతడి కుమారుడు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెట్రోలు పోసుకొని ఆత్మహత్య