
కూతుర్ల మృతికి కారకురాలైన తల్లిపై కేసు నమోదు
తూప్రాన్: కూతుర్ల మృతికి కారకురాలైన తల్లిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివానందం మంగళవారం తెలిపారు. పట్టణ సమీపంలోని హల్దీవాగులో మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత తన ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్వీని(5)ని హల్దీవాగులో తోసి తాను కూడా ఆత్మహత్యాయత్నంకు యత్నించి ప్రాణాలతో బయట పడిన విషయం తెలిసిందే. ఇద్దరు చిన్నారుల మృతికి తల్లి కారణమని ఎస్‌ఐ తెలిపారు. నిందితురాలి మరిది పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కరాటే పోటీల్లో ప్రతిభ
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని గుల్షన్ క్లబ్‌లో రెంజుకి షాటోకన్ స్పోర్ట్స్ కరాటే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెదక్ జిల్లా స్థాయి కరాటే బిల్ట్ ఎగ్జామ్‌లో విద్యార్థులు ప్రతిభ కనర్చినట్లు కరాటే మాస్టర్ దినాకర్ తెలిపారు. సుమారు 100 మంది విద్యార్థులు వివిధ మండలాల నుంచి పాల్గొని ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులకు రెంజుకి షాటోకన్ స్పోర్ట్స్ కరాటే ఆఫ్ ఇండియా వ్యస్థాపక అధ్యక్షుడు మాస్టర్ నగేశ్ బెల్టులు ప్రధానం చేశారు. నితన్య సిరి, ఐశ్వర్య, అక్షర, విశిష్ట రాజ్, సూరజ్, అబ్దుల్లా, అఖిల్, రిషి, స్వరూప్ సింగ్ పాల్గొన్నారు.