
బీఆర్‌ఎస్ సభకు తరలిరండి
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి పిలుపు
మునిపల్లి(అందోల్): ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించే రజోత్సవ సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆవిష్కరించారు. సోమవారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ సభకు పార్టీ కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి ఒకరు చొప్పున రావాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్, నాయకులు చీలపల్లి రాంచంధర్‌రావు, బుదేరా మల్లేశం, పిల్లోడి ప్రభు, బుదేరా విజయభాస్కర్ పాల్గొన్నారు.