ధాన్యం కుప్పను ఢీకొట్టిన బైక్
యువకుడికి తీవ్ర గాయాలు
రామాయంపేట(మెదక్): ధాన్యం కుప్పను బైక్ ఢీకొట్టడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఝాన్సి లింగాపూర్ గ్రామానికి చెందిన నవీన్ మంగళవారం బైక్‌పై ఖాజాపూర్ గ్రామానికి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో రో డ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు.


