వక్ఫ్ బోర్డ్ బిల్లును వెనక్కి తీసుకోవాలి
కుల్ జమాత్ తహఫుజ్ ఏ షరియా
సంగారెడ్డి టౌన్: ఇటీవల కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కుల్ జమాత్ తహఫుజ్ ఏ షరియా కమిటీ డిమాండ్ చేసింది. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో ఆదివారం పాత బస్టాండ్ నుండి ఐబీ వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ...దేశంలో ముస్లిం మైనార్టీలను అణగ తొక్కేందుకే కేంద్రం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందన్నారు. మోదీ ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కేందుకు అనేక రకాల చట్టాలను అమల్లోకి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లును రద్దు చేయకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వివిధ సంఘాల మైనార్టీ నాయకులు, మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు.


