
పెట్టుబడి కూడా రాలేదు..
టమాటా ధర కిలో రూ.5నుంచి రూ.7 లు పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. 2 ఎకరాల్లో వెదురు కట్టెలతో పందిరితో సాగు చేశా. ఎకరాకు లక్షా 20 వేల పెట్టుబడి పెట్టా. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాకపోగా, కూలీలకు అప్పు తెచ్చి ఇవ్వాల్సి వస్తోంది. రవాణా చార్జీలు కూడా రావడం లేదు. పంటను పారబోయాల్సి వస్తోంది. కొన్ని రోజుల క్రితం కిలో ధర రూ.15 పలికిన టమాటా అమాంతం రేటు పడిపోయి రూ.7 కు చేరడంతో ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది.
– కానమైన రాజు, శివారు వెంకటాపూర్