
మామిడి పూతలా కొత్త ఆశలు..
మామిడి తోరణాలు
తెలుగు లోగిళ్లు
శ్రీ విశ్వావసుకు స్వాగతం
పలుకుతున్నాయి
మామిడి పూతలా
కొత్త ఆశలు చిగురిస్తూ
కొత్త కుండలో షడ్రుచులు కలగలసిన
తీరుగా నూతన సంవత్సరాది ప్రతి ఒక్కరిలో
’విశ్వ’మంతటి వెలుగులు నింపాలని
తెలుగు మదినిండా ఈ విశ్వ’నామం
ఆశలు నింపాలని,
చెడును పారద్రోలి ఆశలు ఆశయాలను
వెంట తీసుకురావాలని శ్రీ విశ్వావసుని
కోరుతూ..స్వాగతం పలుకుదాం
– అనంతవరం సిద్ధిరామప్ప,
గుండారెడ్డిపల్లి