మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. ఒక్కసారిగా! | - | Sakshi
Sakshi News home page

మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. ఒక్కసారిగా!

Oct 17 2023 4:44 AM | Updated on Oct 17 2023 8:48 AM

- - Sakshi

ఘటనా స్థలంలో పోలీసు అధికారి

సాక్షి, మెదక్‌: కుటుంబ కలహాలు, అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపం చెందిన ఒక వ్యక్తి చెరువులోదూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని సర్ధన గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కట్ట వెంకటేశం(35) తన భార్య లక్ష్మి మృతి చెందగా మరో మహిళతో వివాహం చేయగా ఆమె ఇటీవల వెంకటేశంతో గొడవపడి వెళ్లిపోయిందని వెంకటేశం తల్లి నర్సమ్మ తెలిపింది. దానికి తోడు ఆయనకు ఫిట్స్‌ వ్యాధి ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 14న ఇంట్లో నుంచి వెళ్లి పోయాడని, సోమవారం ఐలేరు చెరువులోపడి మృతి చెందినట్లు చెప్పింది. నర్సమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
 
Advertisement
Advertisement