పటాన్‌చెరు: చిన్న మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరగడంతోపాటు శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్‌పూర్ మండల పరిధిలోని దయారా గ్రామంలో రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధే లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ దేవానందం, సర్పంచ్ భాస్కర్ గౌడ్, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ పాల్గొన్నారు.
గోనెమ్మ యూత్ అసోసియేషన్ భవనం ప్రారంభం
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తిలో రూ.30 లక్షల సొంత నిధులతో నిర్మించిన గోనెమ్మ యూత్ అసోసియేషన్ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.
మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. కార్యక్రమంలో మార్కెట్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
విభిన్న సంస్కృతులకు నిలయం పటాన్‌చెరు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): విభిన్న సంస్కృతులకు నిలయం పటాన్‌చెరు నియోజకవర్గమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్‌లో కేరళ సౌహృదయ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి