కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య... | - | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య...

Jul 21 2023 5:32 AM | Updated on Jul 21 2023 10:03 AM

- - Sakshi

సంగారెడ్డి: చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన ఘటన సిద్దిపేటరూరల్‌ మండల పరిధిలోని రాఘవాపూర్‌ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాఘవాపూర్‌ గ్రామానికి చెందిన ఏర్వ నర్సవ్వ కూతురు ఏర్వ శివాణి (21)కి నెలరోజుల క్రితం అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ జరిగింది. ఆపరేషన్‌ అయిన వారం రోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉందని చెప్పగా కుటుంబీకులు ఆస్పత్రిలో చూపించారు.

అయినా కడుపునొప్పి తగ్గలేదు. దీంతో ఈ నెల 12వ తేదీన రాత్రి సమయంలో ఆకస్మాత్తుగా వారి వద్ద కింద పడిపోయింది. ఏం జరిగిందని కుటుంబీకులు అడగడంతో కడుపునొప్పి భరించలేక బీపీ గోలీలు, నిద్రమాత్రలు వేసుకున్నానని చెప్పింది. దీంతో వెంటనే శివాణిని సిద్దిపేటలో పనిచేసే ప్రైమ్‌ కేర్‌ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో అదేరోజు సిద్దిపేటలోని సురక్ష ఆస్పత్రిలో చేర్పించారు.

చికిత్స పొందుతున్న శివాణి పరిస్థితి 19వ తేదీన మరింత విషమంగా మారడంతో వైద్యం నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో గురువారం ఉదయం 01:50గంటలకు చేర్పించారు. దీంతో శివాణిని పరీక్షించిన వైద్యులు మార్గ మధ్యలోనే శివాణి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి అనుమానం లేదని, అమ్మమ్మ నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement