
సందీప్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
గజ్వేల్‌రూరల్: గజ్వేల్‌లో ఇటీవల జరిగిన ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. పట్టణంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేయగా ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో పట్టణానికి చెందిన సందీప్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు కప్పర ప్రసాద్‌రావు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఫోన్‌లో సందీప్‌ను పరామర్శించి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకొని మనోధైర్యం కల్పించారు.
పెండింగ్ బిల్లులు
చెల్లించాలని వినతి
మెదక్ కలెక్టరేట్: మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలను వెంటనే చెల్లించడంతో పాటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రూప్లీ, నర్సమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్, డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు రూ. 2 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారని తెలిపారు. ఇప్పటివరకు అమలు చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మికులు, పాల్గొన్నారు.
ఆర్థిక సాయం
జిన్నారం(పటాన్‌చెరు): మండలంలోని బొల్లారం పారిశ్రామికవాడలోని హైగ్రో పరిశ్రమలో గతంలో కార్మికుడు శ్రీనివాస్ మృతి చెందాడు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాల్‌రెడ్డి, బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు. దీంతో మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరిచింది. బుధవారం మృతుడి ఇద్దరు కుమార్తెల పేర్లమీదు రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందించారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పరిశ్రమ యాజమాన్యం, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

చెక్కులను అందిస్తున్న యాజమాన్యం