దాడి చేసిన ఎనిమిది మంది రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

దాడి చేసిన ఎనిమిది మంది రిమాండ్‌

Jun 21 2023 3:32 AM | Updated on Jun 21 2023 9:22 PM

నేరస్తులను రిమాండ్‌కు తరలిస్తున్న దృశ్యం  - Sakshi

నేరస్తులను రిమాండ్‌కు తరలిస్తున్న దృశ్యం

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): బాణామతి, చేతబడి చేశారంటూ చెట్టుకు వేలాడదీసి దాడి చేసిన ఘటనలో ఎనిమిది మంది నేరస్థులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సంగారెడ్డి డీఎస్పీ రవీంద్ర రెడ్డి తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ నవీన్‌ కుమార్‌ వెల్లడించారు. చేతబడి నెపంతో దాయాదులు తమపై దాడి చేశారని ముత్తంగి అమృత భర్త యాదయ్య ఈ నెల 17న ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా కొల్కూరు గ్రామానికి చెందిన ఎనిమిది మంది దాయాదులు ముత్తంగి అమృత, వారి భర్త యాదయ్యతో పాటుగా ఫిర్యాదురాలి అక్క కోవూరి శ్యామమ్మపై దాడి చేసినట్లు తెలిసింది.

విచారణ చేపట్టగా గ్రామానికి చెందిన కోహీర్‌ లక్ష్మణ్‌(ఏ1), గడ్డం పెంటయ్య(ఏ2), ముత్తంగి బాగయ్య(ఏ3), సర్గల్ల శివయ్య(ఏ4), కోవూరు శివకుమార్‌(ఏ5), బేగరి శివ కుమార్‌(ఏ6), గడ్డం శ్యామల(ఏ7), గడ్డం ఆగమ్మ (ఏ8) వారు చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో సదాశివపేట పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుచగా వారికీ రిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు నాగలక్ష్మి, సుదర్శన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement