వరి విత్తనరకాలు, పంటకాలం, నారుపోసే సమయం | Sakshi
Sakshi News home page

వరి విత్తనరకాలు, పంటకాలం, నారుపోసే సమయం

Published Thu, Jun 15 2023 7:54 AM

- - Sakshi

రిసాగుకు సంబంధించి పంట కాలాన్ని ముందుకు జరిపే క్రమంలో ఏఏ రకాల విత్తనాలతో నార్లు పోసుకోవచ్చని, వాటి పంట కాలం తదితర వివరాలను సిద్దిపేట జిల్లా తోర్నాల ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సీహెచ్‌.పల్లవి వివరించారు.

దీర్ఘకాలిక రకాలు: పంటకాలం 140 రోజులపైనే. ఇందులో ప్రధానమైన వరి విత్తన రకాలు వరంగల్‌ 44 (సిద్ది), కంపాసాగర్‌ 2874, సాంబమసూరి. మే 25 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు నార్లు పోసుకోవాలి

మధ్యకాలిక రకాలు: పంటకాలం 135 రోజులు. ఇందులో ప్రధానమైన రకాలు రాజేంద్రనగర్‌ 2458 (కృష్ణ), వరంగల్‌ 32100 (వరంగల్‌ సన్నాలు), వరంగల్‌ 915, జగిత్యాల 384, పొలాస ప్రభ, జగిత్యాల 28545, జగిత్యాల 27356, వరంగల్‌ 1487 జూన్‌ 15వ తేదీ వరకు నార్లు పోసుకోవాలి

స్వల్పకాలిక రకాలు : పటకాలం 120 నుంచి 125 రోజులు. ఇందులో ప్రధానమైనవి సన్న రకాలైన కునారం–1638, వరంగల్‌ 962. రాజేంద్రనగర్‌–21278, రాజేంద్రనగర్‌– 15048 (తెలంగాణ సోనా), దొడ్డురకాల్లో కునారం–118 (కూనారం సన్నాలు), జగిత్యాల – 24423, జగిత్యాల – 18047 (బతుకమ్మ), రాజేంద్రనగర్‌–29325, మారుటేరు–1010 (కాటన్‌ దొర సన్నాలు).

● వానాకాలం వరిపంటకు జూన్‌ 25 లోపు నారు పోసుకుంటే...అక్టోబర్‌ మూడో వారం నుంచి నవంబరు మొదటి వారంలోపు కోతలు పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా మళ్లీ యాసంగిలో వరి ఆరుతడి పంటలను సకాలంలో సాగు చేసుకోవడానికి వీలవుతుంది. ఇక యాసంగిలో వరి సాగుకు స్వల్పకాలిక రకాలను ఎంచుకొని నవంబర్‌ 15 నుంచి 20వతేదీలోపు విత్తుకుంటే మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్‌ మొదట్లో పంట కోతకు వస్తుంది. తద్వారా వర్షాల నష్టం నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement