
వివరాలు నమోదు చేసుకుంటున్న డాక్టర్ వినోద ఉన్నమ్
గజ్వేల్‌రూరల్: పుట్టిన బిడ్డకు గంటలోపు పట్టించే ముర్రుపాలు అమృతంతో సమానమని బీఎఫ్‌హెచ్‌ఐ (బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇన్సియేటివ్) డాక్టర్ వినోద ఉన్నమ్ అన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా(బీపీఎన్‌ఐ) ఆధ్వర్యంలో మంగళవారం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బందికి తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టిస్తే కలిగే ఉపయోగలు, పాలు పట్టించే విధానం అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆస్పత్రిలో ఐఎంఎస్ చట్టం అమలు, చిన్నారులకు పాలు పట్టించే విధానం, బాలింతలకు అందిస్తున్న కౌన్సిలింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్, ఆర్‌ఎంఓ డాక్టర్ రాము, గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల, డాక్టర్ శాంతన్‌రెడ్డి, డాక్టర్ జ్యోతి, నర్సింగ్ సూపరింటెండెంట్ శాంతకుమారి పాల్గొన్నారు.