
మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్
చిన్నశంకరంపేట(మెదక్): ఏబీసీడీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ అన్నారు. మంగళవారం మండలంలోని రుద్రారం, చందాపూర్, జంగరాయి గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ సంగ్రామ యాత్ర సాగింది. ఈ సందర్భంగా రుద్రారం గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ కోసం సంగ్రామయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4న హైదరాబాద్ ముట్టడికి గ్రామాల నుంచి దళితులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాసాయిపేట యాదగిరి, మురళిమాదిగ, చిన్నంగల కుమార్, బాబు, నర్సింహులు, రాజు, యాదగిరి ఉన్నారు.