‘గీతం’లో ఘనంగా అచీవర్స్‌ డే

మాట్లాడుతున్న డీఎస్‌.రావు - Sakshi

పటాన్‌చెరు టౌన్‌: రుద్రారంలోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ మంగళవారం అచీవర్స్‌ డేను ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాల్లో ఎంపికై న ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, సైన్స్‌, ప్యామానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌ విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అందజేశారు. 2022 – 23 విద్యా సంవత్సరంలో దాదాపు 200 దేశీయ, బహుళ జాతి కంపెనీలు 800 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు గీతం ప్రతినిధులు తెలిపారు. మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు రూ.13.58 లక్షల గరిష్ట వార్షిక వేతనం, సైన్స్‌, ఫార్మసీ విద్యార్థులు రూ.9 లక్షల చొప్పున, బీఏ విద్యార్థులు రూ.6.5 లక్షల గరిష్ఠ వార్షిక వేతనాలతో ఎంపికయ్యారని పేర్కొన్నారు. వర్చూషా (ఇంటర్నేషనల్‌) గీతం విద్యార్థిని 25 వేల బ్రిటీష్‌ పౌండ్లు (రూ.23.09 లక్షల) వార్షిక వేతనంతో ఎంపిక చేయగా, అమెజాన్‌ (రెండు వేర్వేరు ఉద్యోగాల కోసం) రూ.17.38 లక్షలు, రూ.14 లక్షల గరిష్ట వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో అద్వితీయమైన కృషి చేస్తున్న అధ్యాపకులను గీతం హెదరాబాద్‌ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్‌ డీఎస్‌.రావు, డైరక్టర్‌ డాక్టర్‌ నాతి వేణుకుమార్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ క్రిష్‌ సంగేగడ్డ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వారియర్‌, ప్రోవీసీ (అకడమిక్స్‌), రెసిడెంట్‌ డెరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top