
మహిళా సంఘాల సభ్యులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న దృశ్యం
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సి పాలిటీని చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని, చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జోగిపేట మున్సిపల్ చైర్మన్, కమిషనర్ జి.మల్లయ్య, సీహెచ్.తిరుపతి అన్నారు. సోమ వారం స్వచ్ఛోత్సవ్ – 2023 కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల చేత స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలు స్వచ్ఛతలో భాగస్వాములు కావాలన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో స్వచ్ఛ బ్లడ్ కార్యక్రమం నిర్వహించాలని మహిళలతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. చెత్తను రోడ్డుపై వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు నిషేధించామన్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులు జూట్ బ్యాగులు వాడి కాలుష్య నియంత్రణకు సహకరించాలన్నారు. ఈ విషయంలో వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వినయ్‌కుమార్, మాజీ కౌన్సిలర్ పులుగు గోపి, మెప్మా అధికారి భిక్షపతి, కార్యాలయ సిబ్బంది నారాయణ, మహిళా సంఘాల సభ్యులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.