Who Is Russia President Vladimir Putin Secret Lover Alina Kabaeva, Unknown Things About Her - Sakshi
Sakshi News home page

Vladimir Putin Secret Lover: పుతిన్‌ రహస్య ప్రేయసి.. ఇప్పుడు ఎక్కడ దాక్కుంది?

Mar 8 2022 1:20 PM | Updated on Mar 8 2022 1:38 PM

Russia Prez Putin Secret Lover Alina Kabaeva Details - Sakshi

వైవాహిక జీవితాన్ని పెంట చేసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. సీక్రెట్‌ ప్రేయసిని మాత్రం అపురూపంగా చూసుకుంటున్నాడు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల అధినేతలు, వాళ్ల వ్యక్తిగత జీవితాలు, అలవాట్లు.. వగైరా వగైరా విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్‌ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు హాట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. 


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఓ రహస్య ప్రేయసి ఉందని, ఆమె పేరు అలీనా కబయేవా అని, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉందనే టాపిక్‌ నడుస్తోంది. అలీనా కబయేవా.. గతంలో జిమ్నాస్ట్‌గా ఉండేది. పుతిన్‌ విడాకుల తర్వాత ఆయనతో చనువుగా ఉంటోంది. ఆపై మీడియా మేనేజర్‌గా.. ప్రస్తుతం రష్యా రాజకీయాల్లోనూ ఆమె తన మార్క్‌ చూపిస్తోంది.

ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినాతో 1983లో వ్లాదిమిర్‌ పుతిన్‌ వివాహం జరిగింది. ఈ జంటకు మరియా, కటేరినా అనే కూతుళ్లు ఉన్నారు. 2014లో ల్యూడ్మిలా నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నాడు పుతిన్‌. ఆపై రష్యా మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్‌ మాజీ భార్య వెండి డెంగ్‌తో పాటు పలువురు టీనేజర్లతో పుతిన్‌ డేటింగ్‌ చేసినట్లు పుకార్లు ఉన్నాయి.

అయితే ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనాతో పుతిన్‌ వైవాహిక బంధం చెడిపోవడానికి కారణం కూడా అలీనా అనేది పుతిన్‌ సన్నిహితుల ఆరోపణ.  2008 నుంచే అలీనాకు పుతిన్‌తో పరిచయం ఉందని, వాళ్ల డేటింగ్‌ వ్యవహారం తెలిసే ల్యూడ్మిలా మనసు విరిగి విడాకులు తీసుకుందట!.

అప్పటి నుంచి సీక్రెట్‌ ఫస్ట్‌లేడీగా అలీనా కొనసాగుతోంది.

1983లో తాష్కెంట్‌లో పుట్టిపెరిగిన అలీనా.. రిథమిక్‌ జిమ్నాస్ట్‌. పదిహేనేళ్ల వయసులో పోర్చుగల్‌లో జరిగిన యూరోపిన్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. 

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అలీనా బ్రాంజ్‌ మెడలిస్ట్‌ కూడా. నాలుగేళ్ల తర్వాత గ్రీస్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కూడా గెల్చుకుంది. ఇప్పటిదాకా తన కెరీర్‌లో ఆమె రెండు ఒలింపిక్స్‌ మెడల్స్‌, 14సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మెడల్స్‌, 21 యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ మెడల్స్‌ గెల్చుకుందామె. 

2001లో డోపిండ్‌ స్కాండల్స్‌తో ఆమె జీవితం మలుపు తిరిగింది. రెండేళ్లపాటు నిషేధానికి గురైంది. 

పుతిన్‌తో కలిసి ఆమె నలుగురు పిల్లల్ని(ఇద్దరు కవలలు) కనిందనేది రష్యన్‌ యాంటీ మీడియా హౌజ్‌ల వాదన. ఎందుకంటే ఆమె ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టలేదు కాబట్టి.

వైవాహిక జీవితాన్ని పెంట చేసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. సీక్రెట్‌ ప్రేయసిని మాత్రం అపురూపంగా చూసుకుంటున్నాడు.

ఇక పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యక్తిగత ప్రశ్నలను దాటేసి పుతిన్‌.. తనకూ ఓ వ్యక్తిగత జీవితం ఉందని, దాని గురించి ప్రస్తావించిడం ఇష్టం లేదని, దానిని గౌరవిస్తే బాగుంటుందని మీడియాకు చురకలు అంటించిన సందర్భాలు ఎన్నో. 

అలీనా ఎక్కడ?
ప్రస్తుతం అలీనా.. స్విస్(స్విట్జర్లాండ్‌) కొండల్లో సేద తీరుతున్నట్లు ఇతర దేశాల నిఘా వర్గాల ఆధారంగా కొన్ని మీడియా హౌజ్‌లు కథనాలు ప్రచురిస్తు‍న్నాయి. యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా పుతిన్ తన కుటుంబాన్ని అణుబంకర్లలో దాచి పెట్టారు.  ఆమెతో తనకు జన్మించిన నలుగురు పిల్లలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారు. స్విస్ కొండల్లో అత్యంత సురక్షితమైన, రహస్యమైన ప్రాంతాల్లో వారు భద్రంగా ఉన్నట్లు ఆ కథనాల సారాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement