జియాకోమోపై బీజేపీ ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

జియాకోమోపై బీజేపీ ఫిర్యాదు

Nov 20 2026 7:39 AM | Updated on Nov 20 2026 7:39 AM

జియాకోమోపై బీజేపీ ఫిర్యాదు

మహేశ్వరం: అంతర్జాతీయ వేదికపై భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించిన ఇటలీకి చెందిన యూరోపియన్‌ సోషలిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి జియాకోమో ఫిలిబెక్‌పై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం మహేశ్వరం జోన్‌ డీసీపీ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

చిరుత కోసం

ట్రాప్‌ కెమెరాలు

దోమ: చిరుత పులి జాడ కోసం గాలిస్తున్నట్లు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రాఘవేందర్‌ తెలిపారు. గురువారం దిర్సంపల్లి సమీపంలోని బషిరేణిగుట్లలో ఏర్పాటు చేసి ట్రాప్‌ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజిపల్లిలో లేగదూడను చిరుత చంపి తినడంతో ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పొలాల వద్ద రైతులు ఒంటరిగా ఉండొద్దన్నారు. చిరుత కనిపిస్తే తమకు సమా చారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీట్‌ ఆఫీసర్‌ రవి రాఘవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement