వివాహితకు వేధింపులు | - | Sakshi
Sakshi News home page

వివాహితకు వేధింపులు

Nov 20 2026 7:39 AM | Updated on Nov 20 2026 7:39 AM

● కుటుంబసభ్యులపై హత్యాయత్నం

● ఎంపీటీసీ మాజీ సభ్యుడిపై కేసు నమోదు

అబ్దుల్లాపూర్‌మెట్‌: ఓ వివాహితను వేధించడంతో పాటు ఆమె కుటుంబసభ్యులపై హత్యాయత్నానికి పాల్పడిన ఓ ఎంపీటీసీ మాజీ సభ్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మజీద్‌పూర్‌కు చెందిన గుంటోజు శ్రీధర్‌ భార్య జయశ్రీకి లష్కర్‌గూడ ఎంపీటీసీ మాజీ సభ్యుడు సీక సాయికుమార్‌గౌడ్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటుండేవారు. విషయం శ్రీధర్‌కు తెలిసి భార్యను నిలదీశాడు. అక్టోబర్‌ 10న రెండు గ్రామాల పెద్దల సమక్షంలో సాయికుమార్‌గౌడ్‌ను పిలిపించి ఓ గెస్ట్‌హౌస్‌లో పంచాయితీ పెట్టారు. జయశ్రీ, సాయికుమార్‌గౌడ్‌ ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోకూడదు, ఫోన్‌ మాట్లాడకూదని చెప్పగా అందుకు ఇద్దరూ అంగీకరించారు. అక్కడి నుంచి అందరూ బయటకు వస్తున్న క్రమంలో సాయికుమార్‌గౌడ్‌ కత్తితో శ్రీధర్‌పై దాడి చేయడంతో పాటు అతని బంధువులపై కర్రలతో దాడి చేశాడు. దాడి నుంచి శ్రీధర్‌ తప్పించుకోగా గ్రామపెద్దలు సాయికుమార్‌గౌడ్‌ను మందలించి పంపించారు. మూడు రోజులు తర్వాత శ్రీధర్‌ బంధువులకు సాయికుమార్‌గౌడ్‌ ఫోన్‌ చేసి కారులో గొడ్డలి పెట్టుకుని తిరుగుతున్నాని.. ఈసారి శ్రీధర్‌ను, అతని తమ్ముడు సంతోష్‌, భిక్షపతి యాదవ్‌ను కచ్చితంగా అంతం చేస్తానని బెదిరించాడు. జయశ్రీ మానసిక అనారోగ్యంతో బాధపడుతుండడంతో శామిర్‌పేటలోని ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈనెల 15న మరో వ్యక్తితో కలిసి వచ్చిన సాయికుమార్‌గౌడ్‌ను అడ్డుకునేందుకు శ్రీధర్‌ యత్నించడంతో దాడికి పాల్పడ్డారు. దీంతో పాటు జయశ్రీ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తనకు జయశ్రీని అప్పగించాలని, లేకపోతే మీ అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో వారు ఈనెల 16న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సాయికుమార్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement