షాబాద్: పోగొట్టుకున్న మహిళకు తిరిగి పర్సు అందజేసి నిజాయితీ చాటుకున్న యువకుడిని పోలీసులు అభినందించారు. ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దామర్లపల్లి గ్రామానికి చెందిన ఇటిక యాదమ్మ పనినిమిత్తం గురువారం షాబాద్ వచ్చింది. బస్టాండ్ సమీపంలో పర్సు పడిపోగా గమనించలేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న షాబాద్‌కు చెందిన తొంట వెంకటేశ్‌కు పర్సు కనిపించడంతో వెంటనే షాబాద్ పోలీసులకు అప్పగించారు. అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు యాదమ్మను పిలిపించి పర్సును అందజేశారు. అందులో రూ.3,540, ఇతర పత్రాలు ఉన్నట్లు తెలిపారు. తనకు దొరికిన పర్సును ఏమాత్రం స్వార్థం లేకుండా పోలీసులకు అప్పగించి బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు తొంట వెంకటేశ్‌ను ఎస్ఐ విజయ్ శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.


