రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Nov 20 2026 7:39 AM | Updated on Nov 20 2026 7:39 AM

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి ఇంట్లోంచి బయటకు వెళ్లి.. కనిపించకుండా పోయి ఖాతా నుంచి సొమ్ము మాయం మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌ చోరీ

మీర్‌పేట: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి బాలాపూర్‌ చౌరస్తా సమీపంలోని శ్లోక స్కూల్‌ వద్ద ఫుట్‌పాత్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. భారీ వాహనం అతడి తలపై నుంచి వెళ్లడంతో పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుడి వయస్సు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎడమ చేతిపై హాసిని అని పచ్చబొట్టు ఉందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మీర్‌పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శోభన్‌ కథనం ప్రకారం.. గుర్రంగూడ ఆదిత్యనగర్‌కు చెందిన నరసింహస్వామి (55) కొంత కాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నెల 18న ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గుర్రంగూడ ప్రధాన రహదారి వైపు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

చేవెళ్ల: ఓ రైతు ఖాతా నుంచి రెండు సార్లు రూ.95వేలు మాయం అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మండలంలోని ముడిమ్యాలకు చెందిన గౌలికర్‌ సతీష్‌ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన అవసరాలకోసం తన పక్క పొలం యజమాని ఎండీ వాసిఉద్దీన్‌ను డబ్బులు అడిగాడు. ఈ నెల 17న అతడు ఫోన్‌పే ద్వారా రూ.లక్ష బాధిత రైతు బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. అతడు ఆ డబ్బును తీసుకోకముందే అదేరోజు 1.15 గంటలకు రైతు ఖాతా నుంచి అతనికి తెలియకుండా రూ.83 వేలు ఒకసారి, కాసేపటికి రూ.11,999.93 చొప్పున మొత్తం రూ.94,999.93 డెబిట్‌ అయినట్లు అతని ఫోన్‌కు సందేశం వచ్చింది. సైబర్‌ మోసం జరగిందని గుర్తించిన రైతు వెంటనే సైబర్‌ క్రైం హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. డెబిట్‌ అయిన మొత్తంలో రూ.11,999.93 బ్యాంక్‌ హోల్డ్‌లో ఉంచినట్లు తెలిసింది. ఈ విషయమై బాధితుడు చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తులం బంగారు గొలుసు,

రూ.11వేల నగదు తస్కరణ

చేవెళ్ల: కూరగాయల సంతలో ఓ మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ సంఘటన చేవెళ్లలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లలోని రంగారెడ్డి నగర్‌కాలనీకి చెందిన కె.లక్ష్మి ప్రతి వారం లాగే కూరగాయలకోసం గురువారం సాయంత్రం సంతకు వెళ్లింది. ఆమె కుమారుడికి చెందిన తులం బంగారు గొలుసు తెగిపోవడంతో బాగు చేయించేందుకు హ్యాండ్‌బాగులో వేసుకొని సంతకు వచ్చింది. గొలుసుతోపాటు బ్యాగులో రూ.11వేల నగదు కూడా ఉన్నాయి. సంతలో కూరగాయలు కొనుగోలు చేస్తున్న క్రమంలో డబ్బులకోసం హ్యాండ్‌ బ్యాగ్‌ను చూసుకోగా కనిపించ లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అర్హులందరికీ

ఇందిరమ్మ ఇళ్లు

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

మర్పల్లి: అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు వస్తుందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని తిమ్మాపూర్‌, రావులపల్లి గ్రామాల్లో పూర్తయిన ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకా రం చేసేందకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఇళ్లు నిర్మించుకున్న వారికి కానుకలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్‌, పార్టీ సీనియర్‌ నాయకులు రాములు యాదవ్‌, రవీందర్‌, నాగేశ్‌, రావులపల్లి మాజీ సర్పంచ్‌ అబ్రహాం, రమేశ్‌, రాచన్న, గోపాల్‌, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement