నల్లబెల్లం, పటిక రవాణా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

నల్లబెల్లం, పటిక రవాణా గుట్టురట్టు

Nov 20 2026 7:39 AM | Updated on Nov 20 2026 7:39 AM

కడ్తాల్‌: నాటుసారా తయారీకి ఉపయోగించే ముడిసరుకును తరలిస్తున్న ముఠాను ఆమనగల్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టుకున్నారు. ఎకై ్సజ్‌ సీఐ బానోత్‌ పటేల్‌ గురువారం వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం తలకొండపల్లి మండలం సడక్‌ తండాలో తనిఖీలు నిర్వహించగా, తండాకు చెందిన దోళీ నాటుసారా తయారీ చేస్తూ పట్టుబడింది. ఆమె వద్ద 8 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోవడంతో పాటు 50 లీటర్ల పానకం ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటిక ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారని అధికారులు విచారించగా హైదరాబాద్‌ చంపాపేట్‌ ప్రాంతానికి చెందిన మూడవత్‌ కై కీ సరఫరా చేస్తారని, నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం భైరాపూర్‌ గ్రామానికి చెందిన కుండల సైదులు డిండి, కల్వకుర్తి, వెల్దండ, తలకొండపల్లి ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం రాత్రి కడ్తాల్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న కారును తనిఖీ చేసి 900 కిలోల నల్లబెల్లం, 100 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దోళీతో పాటు రవాణా చేస్తున్న కుండల సైదులను అరెస్ట్‌ చేశారు. మూడవత్‌ కై కీ పరారీలో ఉన్నారు. తనిఖీలో ఎకై ్సజ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇద్దరి అరెస్ట్‌.. పరారీలో మరొకరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement