పరిగి: పరిశ్రమల కోసం పట్టా భూములు తీసుకోరాదని, అలాగని హామీ ఇస్తేనే భూ సేకరణకు అంగీకరిస్తామని రైతులు తేల్చిచెప్పారు. గురువారం మండలంలోని కాళ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ కోసం గ్రామసభ నిర్వహించారు. గ్రామ పరిధిలోని 428 ఎకరాల అసైన్డ్ భూమి, 159 ఎకరాల పట్టాభూములకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావే శాల్లో స్థానిక ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ పట్టాభూముల జో లికి వెళ్లామని చెప్పారని, అదే మాటకు అధికారులు కట్టుబడి ఉండాలని రైతులు కోరారు. పట్టాభూము ల జోలికి వస్తే తాము భూ సేకరణకు అంగీకరించ మని చెప్పారు. అనంతరం ఆర్డీఓ వాసుచంద్ర మా ట్లాడుతూ.. గ్రామసభలో రైతుల విన్నపాల ను ఉ న్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్ర మంలో తహసీల్దార్ వెంకటేఽశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.


