రైతు మేళాకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

రైతు మేళాకు వేళాయె

Nov 7 2026 10:11 AM | Updated on Nov 7 2026 10:11 AM

● రూ.2,100 కోట్లతో మక్తల్‌ – నారాయణపేట – కొడంగల్‌ ఎత్తిపోతల రెండో దశ పనులకు శంకుస్థాపన ● ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద కొత్తవాల్‌గూడ నుంచి నియోజకవర్గంలోని నాచారం వరకు రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్‌ రోడ్డు రెండో దశ పనులకు శంకుస్థాపన ● రూ.81 కోట్ల వ్యయంతో పామాయిల్‌ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ ● రూ.42 కోట్లతో కొడంగల్‌, కోస్గి, మద్దూరు బస్టాండ్ల ఆధునీకరణ పనులు ● కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించినసైన్స్‌ మ్యూజియం ప్రారంభం ● మద్దూరులో రూ.20 కోట్లతో నిర్మించనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, రూ.20 కోట్లతో నిర్మించనున్న సమీకృత డివిజనల్‌ కార్యాలయ భవనానికి భూమిపూజ ● రూ.5 కోట్లతో కొడంగల్‌ నిరంజనమఠం నవీకరణ ● రూ.100 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, పోలీస్‌స్టేషన్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నూతన భవనాలు ప్రారంభం ● రూ.1,410 కోట్లతో కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనుల ప్రారంభం ● రూ.118 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల నిర్మాణానికి భూమి పూజ ● కొడంగల్‌ మండలం అప్పాయిపల్లి శివారులో రూ.123 కోట్లతో వ్యవసాయ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభం ● ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్‌ నిర్మాణం ­­

మూడు రోజులపాటు కార్యక్రమాలు

ఆధునిక పనిముట్ల ప్రదర్శన

సందర్శకుల కోసం భారీ ఏర్పాట్లు

కొడంగల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మెగా రైతు మేళా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దుద్యాల మండలం హకీంపేట శివారులోని ఎడ్యూకేషన్‌ హబ్‌ సమీపంలో ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు రైతుమేళాతోపాటు ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. మూడు రోజుల పాటు ఆధునిక వ్యవసాయ పనిముట్లను ప్రదర్శిస్తారు. పలు ప్రాంతాల నుంచి రైతులు, పారిశ్రామిక వేత్తలు, సందర్శకులు హాజరుకానున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల శాఖలకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తలు ఆధునిక వ్యవసాయం, పనిముట్లపై రైతులకు అవగాహన కల్పిస్తారు. 60 ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పంట ఉత్పత్తుల పెంపు, వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సాగునీటి వినియోగం, సబ్సిడీలు, సేవలు, సంక్షేమం గురించి వివరిస్తారు. వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో 200 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, అధునాతన యంత్రాల వినియోగం, సాగు విధానాలపై పలు సూచనలు సలహాలు ఇస్తారు. 9వ తేదీ సోమవారం సుమారు 50 వేల మంది రైతులతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. వీఐపీ, వీవీఐపీ, అధికారులు, పోలీసులు, ప్రెస్‌, సందర్శకులు, రైతుల కోసం భోజనశాలలు ఏర్పాటు చేశారు. రైతులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలతో సీఎం చర్చించడానికి సమావేశ కుటీరాలను అందంగా తీర్చిదిద్దారు.

సీఎం శంకుస్థాపన చేయనున్న పనులు

బొంరాస్‌పేట: అన్నిశాఖల సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతం చేద్దామని కలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు. శుక్రవారం హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌లో రైతు మేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పో ఏర్పాట్లను ఇంటెలిజెన్స్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ఎస్పీ స్నేహమెహ్ర, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్‌, భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌, వైద్యసేవలు, విద్యుత్‌ సరఫరాపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్‌మీనా, డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్డీఓ అనిత, తహసీల్దార్లు కిషన్‌నాయక్‌, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

నేడు ప్రారంభించనున్నసీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement