రెండు బైక్‌లు ఢీ : ఒకరికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ : ఒకరికి తీవ్ర గాయాలు

Nov 7 2026 10:11 AM | Updated on Nov 7 2026 10:11 AM

చేవెళ్ల: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని మీర్జాగూడకు చెందిన తుమ్మలపల్లి శ్రీకాంత్‌ భార్య పిల్లలతో కలిసి చేవెళ్లలో అద్దెకు ఉంటున్నాడు. భార్యాభర్తలు వేర్వేరు ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తూ జీవిస్తున్నారు. శ్రీకాంత్‌ ఓ పాఠశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. గురువారం తన బైక్‌పై కుమారుడితో కలిసి పాఠశాలకు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో పనిచేసే కూలీ మరో బైక్‌పై వేగంగా రావడంతో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌కు తీవ్రగాయాలు, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించి శ్రీకాంత్‌ను మెరుగైన వైద్యంకోసం నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శుక్రవారం భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement