48 ఏళ్లుగా అదే అభిమానం | - | Sakshi
Sakshi News home page

48 ఏళ్లుగా అదే అభిమానం

Nov 7 2026 10:11 AM | Updated on Nov 7 2026 10:11 AM

హుడాకాంప్లెక్స్‌: ఒకటి కాదు రెండు కాదు.. చేసిన సాయం మరిచిపోకుండా ఆ వ్యక్తి 48 ఏళ్లుగా అదే అభిమానం చూపుతున్నాడు. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలోని తుమ్మలగూడెంకు చెందిన ఇస్తారి యాదవ్‌ కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం సరూర్‌నగర్‌కు వచ్చి కూలి పనిచేసుకుంటూ గుడిసెలో జీవనం సాగించేవాడు. బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పోరాటాలు చేస్తున్న క్రమంలో కార్మికనాయకుడు అజీజ్‌పాషాను ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని ఆశ్రయం కోరాడు. స్పందించిన ఆయన 1978లో సరూర్‌నగర్‌ డివిజన్‌ భగత్‌సింగ్‌ నగర్‌లో 60 గజాల ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వం ద్వారా ఇప్పించారు. అప్పటినుంచి అజీజ్‌పాషాను ఇస్తారి అభిమానిస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతూ వస్తున్నాడు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడ సీపీఐ సమావేశాలు జరిగినా.. అజీజ్‌పాషా ఏ కార్యక్రమానికి హాజరైనా కనుక్కుని మరీ వచ్చి పూలమాల, శాలువాతో సత్కరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం 85 ఏళ్ల వయసులోనూ తన అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. తాజాగా శుక్రవారం సరూర్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన అజీజ్‌పాషాను కలిసి మరోసారి సత్కరించాడు. ఆయన ఇంప్పించిన ఇంట్లోనే జీవిస్తున్నానని, ఆయన చలవతోనే తన ఇద్దరు బిడ్డల పెళ్లి చేశానని తెలిపాడు. తన జీవితాంతం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటానని పేర్కొన్నాడు. ఈ సన్నివేశాన్ని అందరూ ఆసక్తిగా చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement