● ఎస్‌ఐఆర్‌పై కేంద్రం స్పష్టత ఇవ్వాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావంతులు, మేధావుల సూచన
తాండూరు: సర్ ప్రక్రియపై పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తాండూరు విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు సూచించారు. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సర్‌తో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిపోతున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. ఓటరు జాబితాలో పేర్లు గల్లంతవుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. అనంతం ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమావేశంలో తన దృష్టికి వచ్చిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. స్థానికంగా ఎదురవు తున్న సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుని, ఓటరు హక్కులకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్, బీజేపీ నాయకులు మనోహర్‌రావు, విద్యావంతులు, మేధావులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, తపస్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు, వ్యాపారులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


