యువకుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువకుడి అదృశ్యం

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

యువకుడి అదృశ్యం జాతీయ రహదారిపై డీసీఎం బోల్తా

పహాడీషరీఫ్‌: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన డి.జేమ్స్‌ (27) ప్రైవేట్‌ ఉద్యోగి. అక్టోబర్‌ 30న పురానాపూల్‌కు పని నిమిత్తం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బైక్‌పై బయల్దేరిన జేమ్స్‌ రాత్రి వరకు కూడా రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ రావడంతో అతని తండ్రి జాన్సన్‌ పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశాడు. ‘లోన్‌సెన్సీ’ అనే లోన్‌ యాప్‌ నుంచి కొన్ని రోజులుగా వేధిస్తూ మెసేజ్‌లు వచ్చాయని, ఈ క్రమంలోనే తన కుమారుడు అదృశ్యమై ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

● సీఎం రేవంత్‌రెడ్డి సభకు సామగ్రి తరలిస్తున్న వాహనం

● పరిగిలోని అమరవీరుల స్తూపం వద్ద పల్టీ

పరిగి: కొడంగల్‌లో మూడు రోజుల పాటు కొనసాగనున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కోసం సామగ్రితో వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ఘటన పరిగి పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనె 7నుంచి 9వ తేదీ వరకు సీఎం తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్టేజీ ఏర్పాటు కోసం సామగ్రి నింపుకొన్న డీసీఎం శుక్రవారం శంషాబాద్‌ నుంచి హకీంపేట్‌కు బయలుదేరింది. పరిగిలోని అమరవీరుల స్తూపం వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. సామగ్రి మొత్తం చెల్లాచెదురుగా పడిపోవడంతో హైదారాబాద్‌– బీజాపూర్‌ జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై పడిన సామగ్రిని తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement