ప్రకృతిపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతిపై అవగాహన అవసరం

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

కడ్తాల్‌: పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల సంరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంలో ఎర్త్‌ లీడర్స్‌ పాత్ర అభినందనీయమని సోషల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ సీనియర్‌ మేనేజర్‌ కౌషల్‌ కిషోర్‌ కుమార్‌, రామకృష్ణ మఠం స్వామి శితికంఠానందస్వామి అన్నారు. కౌన్సిల్‌ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ పర్యావరణ సంస్థ– తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఆన్మాస్‌పల్లి ఎర్త్‌ సెంటర్‌లో శనివారం 2025–26 సంవత్సరానికి సంబంధించిన యంగ్‌ఎర్త్‌ లీడర్స్‌ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ హిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు చిన్నానాటి నుంచే ప్రకృతిపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యాబోధనతో పాటు పర్యావరణ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీజీఆర్‌ చైర్‌ పర్సన్‌ లీలాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. యంగ్‌ ఎర్త్‌ లీడర్‌ కార్యక్రమం విశాలమైన ఆశయాలతో ఏర్పడిందని, దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. సీజీఆర్‌ చేపడుతున్న కార్యక్రమాలకు సహకారం అందిస్తామని నాబార్డ్‌ జనరల్‌ మేనేజర్‌ గణపతి తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో ప్రతిభ చూపిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలకు పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీజీఆర్‌ సీఈఓ నారాయణరావు, ప్రొఫెసర్‌ ఉపేందర్‌రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త సాయిభాస్కర్‌రెడ్డి, సీజీఆర్‌ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, భూషన్‌రెడ్డి, ఉమామహేహేశ్వర్‌రెడ్డి, సీజీఆర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement