విద్యార్థులు నిరంతరం శోధించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు నిరంతరం శోధించాలి

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

విద్యార్థులు నిరంతరం శోధించాలి

శంకర్‌పల్లి: ఆధునిక యుగంలో విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను శోధించి, నూతన ఆవిష్కరణలు చేపట్టాలని హెచ్‌సీఎల్‌ సహ వ్యవస్థాపకుడు, ఫాదర్‌ ఆఫ్‌ హార్డ్‌వేర్‌ ఇన్‌ ఇండియా అజయ్‌చౌదరి అన్నారు. మండలంలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్‌ హాలులో శనివారం ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌, ఇక్ఫాయ్‌ ఛాన్స్‌లర్‌ డా.సి.రంగరాజన్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి అజయ్‌ చౌదరితో పాటు ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డా.నాగేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్స్‌ని అందించింది. అనంతరం పీహెచ్‌డీ, ఎంబీఏ తదితర విభాగాలకు చెందిన 4,402 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా అజయ్‌ చౌదరి మాట్లాడుతూ.. విద్యార్థులు సాధించాల్సిన లక్ష్యాలను దృఢంగా నిర్దేశించుకున్నప్పుడు.. గెలుపు మార్గాలు సులభంగా దొరుకుతాయన్నారు. రంగరాజన్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు అనేది దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని, పట్టభద్రులు అనేవారు మార్పునకు కాబోయే నాయకులుగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఇక్ఫాయ్‌ వీసీ ప్రొ.డా. వినయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement