ఆమనగల్లు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డా.కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్, వివిధ రికార్డులను పరిశీలించారు. మందుల నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యసిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగరాజు, ఊర్మిల, సిబ్బంది తిరుపతిరెడ్డి, వేణు, చంద్రశేఖర్‌రెడ్డి, రాణి, శ్రీను, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు


