గొంతునులిమి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించి | - | Sakshi
Sakshi News home page

గొంతునులిమి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించి

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

షాద్‌నగర్‌: కన్న కూతురుని హత్య చేసిన కేసులో పోలీసులు తల్లిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో గురువారం డీసీపీ శిరీష వివరాలు వెల్లడించారు. కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హనుమాన్‌ కాలనీకి చెందిన ముయ్యాదిరాజు, విజయలక్ష్మి దంపతులు. వారి కుమార్తె సువర్ణ అలియాస్‌ లవ్లీ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఫోన్‌లో ఎక్కువ మాట్లాడటం, చెప్పిన మాట వినకపోవడంతో తల్లీకూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఈనెల 27న సాయంత్రం మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహనికి గురైన తల్లి కూతురు గొంతు నులిమి చంపింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చీరతో ఉరి వేసుకున్నట్లు కనిపించేలా మెడకు చీరను బిగించింది. ఏమీ తెలియనట్లు కూరగాయాలకు వెళ్లింది. తిరిగి వచ్చి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కేకలు వస్తూ విలపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించింది. దీంతో విజయలక్ష్మిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను డీసీపీ అభినందించారు.

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు

కొందుర్గు: నేరాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని డీసీపీ శిరీష అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను గురువారం సందర్శించి పోలీస్‌స్టేషన్‌ పనితీరు, సిబ్బంది విధులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు నేరాలను నియంత్రిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్‌హెచ్‌ఓ వరప్రసాద్‌, ఏఎస్‌ఐ ఛత్రియా, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వీడిన బాలిక హత్యకేసు మిస్టరీ

మాట వినడం లేదని కన్న కూతురిని అంతమొందించిన తల్లి

వివరాలు వెల్లడించిన డీసీపీ శిరీష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement