హుడాకాంప్లెక్స్: సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. ఖేలో ఇండియా యూత్‌గేమ్స్‌లో భాగంగా సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చారు. ఫుట్‌బాల్ అండర్–17 బాలుర విభాగంలో కె.లలిత్తేజ్, ఎస్.ఆకాష్ రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలవగా, అండర్–19 విభాగంలో పి.శరత్‌కుమార్, డి.గాంధీ, జి.ధోని, ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్–19 బాలికల విభాగంలో బి.మధుప్రియ, బి.హరిణి తృతీయ స్థానంలో నిలిచారు. రగ్బీ అండర్–19 బాలికల విభాగంలో బి.హరిణి, బి.మధుప్రియ మొదటి స్థానంలో నిలవగా, అండర్ –19 బాలుర విభాగంలో డి.గాంధీ, ఆర్.ఇశాంత్, ఈ.పరమసింహతేజ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకున్నారు. వీరిలో ఈ.పరమసింహతేజ, ఆర్.ఇషాంత్, లలిత్తేజ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. క్రీడాపోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు.
ప్రశంసాపత్రాలతో విద్యార్థులు


