వీబీజీరామ్‌జీ పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

వీబీజీరామ్‌జీ పనులు వేగవంతం చేయాలి

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

వీబీజీరామ్‌జీ పనులు వేగవంతం చేయాలి వారంలోపు బకాయిలు చెల్లించండి ఇబ్రహీంపట్నం రూరల్‌: జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) బకాయిలు వారం రోజుల్లో చెల్లించాలని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి ఆదేశించారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అధికారులు, రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 17 ప్రకారం బకాయిలు కట్టాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఢిల్లీకి తరలివెళ్తాం

అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి

ఇబ్రహీంపట్నం రూరల్‌: గ్రామీణ కూలీలు, రైతులకు వీబీజీరామ్‌జీ కింద పనులు కల్పించాలని, పెండింగ్‌ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి బుధవారం జిల్లా అధికారులకు సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుక అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫర్స్‌కు హాజరయ్యారు. జిల్లాలో చేపట్టిన అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలను నిర్ణిత కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. వీబీజీరామ్‌జీ పనులను విస్తృతంగా కల్పించేందుకు నలభై మంది కూలీలకు ఒక మేట్‌ను నియమిస్తున్నామని మంత్రికి వివరించారు. పశుగ్రాసం పెంచే విధంగా, నీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఓ శ్రీలత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, మిషన్‌ భగీరథ ఏస్‌ఈ రాజేశ్వర్‌రావు, డీపీఓ సురేష్‌ మోహన్‌, వ్యవసాయ శాఖ అధికారి సుజాత తదితరులు పాల్గొన్నారు.

రైస్‌ మిల్లర్లకు అడిషనల్‌ కలెక్టర్‌ ఆదేశం

ఆమనగల్లు: ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ధర్నాకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. నియోజకవర్గానికి చెందిన పలువురికి బుధవారం నగరంలోని తన నివాసంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఢిల్లీకి తరలివెళ్తామని స్పష్టంచేశారు. అనంతరం పలువురు నాయకులతో కలిసివెళ్లి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పీసీసీ సభ్యులు అయిల శ్రీనివాస్‌గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, డీసీసీ ఉపాధ్యక్షుడు గూడురు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బట్టు కిషన్‌రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటరుగా నమోదు

చేసుకోండి

మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌

అనంతగిరి: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని సాయి డెంటల్‌ ఆస్పత్రి పీజీ విద్యార్థులకు నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement