కాలుష్యంపై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కాలుష్యంపై కన్నెర్ర

Oct 29 2026 8:24 AM | Updated on Oct 29 2026 8:24 AM

విపరీతమై కాలుష్యం

పరిశ్రమ నుంచి విపరీతమైన కాలుష్యం వెలువడుతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు రోగాల బారిన పడి, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కలుషిత నీరు చెరువుల్లోకి చేరి, చేపలు చనిపోతున్నాయి. వెంటనే పరిశ్రమను మూసేయాలి.

– విజయ, ఉప సర్పంచ్‌, కందివనం

ఫ్యాక్టరీని తరలించాలి

పరిశ్రమ విడుదల చేస్తున్న కాలుష్యం కారణంగా పంటలు పూర్తిగా నాశనమవు తున్నాయి. భూగర్భ జలా లు కూడా విషతుల్యమై పశువులకు రోగాలు వసు ్తన్నాయి. అధికారులు స్పందించి, కాలుష్యం వెదజల్లుతున్న ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించాలి.

– బాల్‌నర్సమ్మ, రైతు

మూసేసే దాకా ఆందోళన

దట్టమైన కాలుష్యం కారణంగా ప్రజలు, రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి కాలుష్య పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి. కాలుష్య పరిశ్రమను మూసి వేసే వరకు ఆందోళన కొనసాగిస్తాం.

– అమృనాయక్‌, రైతు, కందినం

షాద్‌నగర్‌: ‘పచ్చని పంట పొలాలకు కాలుష్యం చిచ్చు పెడుతోంది. దట్టమైన కాలుష్యపు పొగ చేల ను నాశనం చేస్తోంది. కాలువ ద్వారా పారుతున్న కలుషిత నీరు చెరువులోని చేపల మృతికి కారణమవుతోంది. మూగజీవాలతో పాటు గ్రామస్తులను సైతం వ్యాధుల బారిన పడేస్తోంది. ఇంతటి ప్రమాదకరమైన పరిశ్రుమను వెంటనే రద్దు చేయాలి’ అని కందివనం గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఈ మేర కు బుధవారం ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించా రు. కంపెనీని మూసేసే వరకూ ఆందోళన విరమించేది లేదన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద పరిధిలో ఏర్పాటు చేసిన మెటల్‌ స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమ తమకు జీవన్మరణ సమస్యగా మారిందని కందివనం సర్పంచ్‌ జెమిని, ఉప సర్పంచ్‌ విజయయాదగిరి, మాజీ సర్పంచ్‌ శివజ్యోతి, గోపాల్‌గౌడ్‌ తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు.

పొగబారుతున్న గ్రామాలు

స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యంతోం చుట్టు పక్కల ఉన్న కందివనం, చౌలపల్లి, గుండెగానితండా, పిట్టలగడ్డతండాలు పొగబారుతున్నాయని ఆందోళనకారులు ఆరోపించారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో విడుదల చేస్తున్న కాలుష్యంతో పంట పొలాలు నాశనమవుతున్నాయన్నారు. కందివనం పాఠశాల భవనం నల్లగా మారిపోతోందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమను మూసేయాలని కందివనంవాసుల డిమాండ్‌

మొగిలిగిద్ద శివారులోని

ఫ్యాక్టరీ ఎదుట ధర్నా

అధికారులు స్పందించాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement