ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి శ్రీనేష్‌కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో టీజీఓఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు, హౌసింగ్ సొసైటీ ఏర్పాటు, నూతన సభ్యుల చేరిక, 2027–డైరీ, క్యాలెండర్ సేకరణపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం సంఘం కోశాధికారిగా దేదీప్య రేవతి, వైస్ ప్రెసిడెంట్లుగా రాకేష్, శ్రీనివాస్, మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా సైదమ్మ, జాయింట్ సెక్రటరీలుగా మహేశ్వర్, సూర్య, కల్చరల్ సెక్రటరీగా జ్యోత్స్న, ఆఫీస్ సెక్రటరీగా విక్టోరియా రాణి, ఈసీ మెంబర్‌గా దీప్తిని ఎన్నకున్నారు. ఈకార్యక్రమంలో నూతనకంటి వెంకట్, నర్సిరెడ్డి, శాంతిశ్రీ, నాగేశ్వర్‌రావు, రాకేష్, అనిత తదితరులు పాల్గొన్నారు .


