మంచాల: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ చాలా బాగుందని మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ మాజీ చైర్మన్ జి.చిన్నారెడ్డి అన్నారు. బుధవారం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులను పరిశీలించారు. క్రీడా మైదానాలు, డిజిటల్ తరగతి గదులు బాగున్నాయని కితాబిచ్చారు. ప్రొఫెసర్ జలంధర్‌రెడ్డి, టీపీఎస్ హెచ్ఎం గిరిధర్‌గౌడ్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాములు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్‌గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


