పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

ఎల్‌నినోను ఎదుర్కొందాం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం 8లోu ఆమనగల్లు: ప్రజల కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగ్యాలు చిరస్మరణీయమని మహేశ్వరం జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా లయన్స్‌ క్లబ్‌, పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. శిబిరంలో రక్తదానం చేసిన 102 మందికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి, మున్సిపల్‌ చైర్మన్‌ పత్యానాయక్‌, మాజీ సర్పంచ్‌ గుర్రం కేశవులు, కౌన్సిలర్లు రాము, జగన్‌, మహేశ్‌, అల్లాజీగౌడ్‌ భాస్కర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాఘవేందర్‌రెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌రెడ్డి, లయన్స్‌క్లబ్‌ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు దివంగత ఎస్‌ఐ హన్మంతరెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించారు. చేవెళ్ల: పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజ సేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతమ్‌ అన్నారు. ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ తరుణ్‌జోషి ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని కేజీఆర్‌ గార్డెన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. మిత్ర బ్లడ్‌ సెంటర్‌ పంజగుట్ట, సృజన తలసేమియా బ్లడ్‌ సెంటర్‌ హైదరాబాద్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో డీసీపీ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. చేవెళ్ల సీఐ కట్ట నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. శిబిరంలో 169 మంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. వీరికి డీసీపీ యోగేశ్‌, ఏసీపీ కిషన్‌ల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌నినోను ఎదుర్కొందాం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి అన్నారు.

● మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌

● ఆమనగల్లు, చేవెళ్లలో రక్తదాన శిబిరం

చేవెళ్లలో రక్తదానం చేస్తున్న

పోలీస్‌ అధికారులు

ఆమనగల్లులో ఎస్‌ఐ హన్మంతరెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి

మానవతా విలువలకు ప్రతీక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement