ఎల్‌నినోను ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను ఎదుర్కొందాం

Oct 29 2026 8:24 AM | Updated on Oct 29 2026 8:24 AM

● సబ్బండ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

● ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి

కుల్కచర్ల: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం చౌడాపూర్‌ మండలం ఈర్లవాగు తండా, చౌడాపూర్‌ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. సమర్థవంతంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. అంతకుముందు కుల్కచర్లలో పటేల్‌ చెరువు తండావార్డుసభ్యులు, గ్రామస్తులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం కుల్కచర్ల గ్రామానికి చెందిన మోత్కూరు వెంకటేష్‌ను పార్టీ మండల స్పోక్స్‌ పర్సన్‌గా, సాల్వీడు గ్రామానికి చెందిన లాలును మండల ప్రధాన కార్యదర్శిగా, కుల్కచర్లకు చెందిన కొమ్ము శ్రీనివాస్‌ను మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌గా నియమించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఆశోక్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ ఆంజనేయులు, పార్టీ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌, చౌడాపూర్‌ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, మండల ప్రత్యేకాధికారి ఉమేష్‌, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఇంచార్జి ఎంపీడీఓ వెంకన్న, ఇంచార్జి ఎంపీఓ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement