బంట్వారం: వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం మండలంలోని సల్బత్తాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బీ నందిని(20)కి ఇదే ఊరికి చెందిన ఏ బసప్పతో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. సాయంత్రం బాత్‌రూంకు వెళ్లిన నందిని చాలా సేపటి వరకు బయటికి రాలేదు. కుటుంబీకులు పైకప్పు తొలగించి చూడగా విగత జీవిగా కనిపించింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి అనుమానం లేదని మృతురాలి సోదరుడు శివకుమార్ పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధారూరు సీఐ రఘురాములు తెలిపారు.
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా ఫిర్యాదుతో తాగునీటి దుర్వినియోగంపై జూబ్లీహిల్స్ పరిధిలో ఓ నివాసానికి జలమండలి రూ.5 వేల జరిమానా విధించింది. బుధవారం జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 57, ప్లాట్ నంబర్ 1152లో తాగునీటిని ఇంటి ప్రాంగణం శుభ్రపరిచేందుకు వినియోగిస్తున్నట్లు స్థానికులు జలమండలి వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి తాగునీటి దుర్వినియోగం జరుగుతున్నట్లు నిర్ధారించుకుని నివాసానికి రూ.5 వేల జరిమానా విధించారు. తాగునీటిని తాగడానికి, గృహ అవసరాలకు మాత్రమే పొదుపుగా వినియోగించాలని సూచించింది.
నల్లాకు అక్రమంగా అమర్చిన 13 మోటార్లు స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో : తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న వినియోగదారులపై జలమండలి విజిలెనన్స్ అధికారులు కొరఢా ఝలిపించారు. బుధవారం శంషాబాద్ జోన్ పరిధిలోని డివిజన్‌న్–8, కొత్వాల్ గూడ వార్డులోని ఆర్‌బీ నగర్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 13 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.


