కొడంగల్: కొడంగల్‌లో డాక్టర్‌గా పనిచేసి ఎంతో మందికి ఉచితంగా సేవలు అందించిన డాక్టర్ కన్నోజు వెంకటేశ్వర్లు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. డాక్టర్‌గా తన వృత్తి ధర్మంతో పాటు మదర్ థెరిస్సా సేవా సంఘం స్థాపించి పేదలకు సేవలందించారు. బహుజన రాజ్యం కోసం బహుజన లెప్ట్ ఫ్రంట్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీఎస్పీలో చేరి నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా పని చేశారు. జీ 6 టీవీ స్థాపించి సమస్యలు వెలుగులోకి తెచ్చారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరి కొడంగల్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా చేశారు.


