యాచారం: మొండిగౌరెల్లి గ్రామంలో అసైన్డ్ భూములు రీ సర్వేలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే చేసే అసైన్డ్ భూమి తనదంటే.. తనదేనని ఇరువురూ తీవ్రంగా ఘర్షణ పడ్డారు. వివరాలు.. గ్రామంలోని సర్వేనంబరు 68లో గురువారం రెవెన్యూ, సర్వే అధికారులు పలువురు రైతులు అసైన్డ్ భూమిని రీ సర్వే చేస్తున్నారు. ఈ సమయంలో ధర్మానాయక్, రాజునాయక్‌లకు చెందిన అసైన్డ్ భూమి వద్దకు సర్వే కోసం వెళ్లారు. భూమి తనదంటే.. తనదేనని.. పరిహారం తనకే అందాలని ఇరువురూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు సర్వే ఆపేసి వెనక్కి వెళ్లిపోయారు. ఈ విషయమై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్
తాండూరు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 25, 26వ తేదీల్లో మల్లిపుల్ డేస్ ధర్నా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌక్‌లో ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు, సామాజిక భద్రతను తుంగలో తొక్కాయన్నారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఆర్‌సీ, డీఏల చెల్లింపు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు నరేష్, బలరాం, శంకర్, వెంకటప్ప, గుండమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు
తాండూరు టౌన్: పట్టభద్రులంతా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు అన్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశానికి తాండూరు నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 60వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్ష వరకు నియామకాలు జరిగాయన్నారు. గత ప్రభుత్వం పట్టభద్రులను, నిరుద్యోగులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించడం తథ్యమన్నారు.
అనంతగిరి: దసరా పండుగను పురస్కరించుకుని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, ఇతర ముఖ్య నాయకులు గురువారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జమ్మి ఇచ్చి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బొంరాస్‌పేట: ఎస్సెస్సీ, ఓ ఎస్సెస్సీ, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలు మార్చి – 2027 వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపుల వివరాలను గురువారం విద్యాశాఖ విడుదల చేసినట్లు దుద్యాల, బొంరాస్‌పేట ఎంఈఓలు శంకర్, హరిలాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 నుంచి ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. నవంబరు 18 నుంచి ఆలస్య రుసుం రూ.50, డిసెంబరు 8నుంచి రూ.200 ఆలస్య రుసుం, డిసెంబరు 18 నుంచి రూ.500 ఆలస్య రుసుంతో 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అన్ని సబ్జెక్టులకు గాను రూ.125, ఫెయిల్ అయినవారు మూడు సబ్జెక్టులకు రూ.110, మూడు సబ్జెక్టులకు పైగా ఉంటే రూ.125, ఒకేషనల్ విద్యార్థులు రూ.60 చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. మిగితా వివరాలను సంబంధిత పాఠశాలల్లో సంప్రదించాలన్నారు.


