ఉద్యోగ భద్రత కల్పించడం హర్షణీయం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించడం హర్షణీయం

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

కొడంగల్‌ రూరల్‌: ఉపాధిహామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుకగా గ్రాట్యూటీతో ఆర్థిక భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఏఈపీడీ సరళ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏపీఓ రాములు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడారు. 3,874 మంది ఎఫ్‌టీఈ ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యూటీ మంజూరు చేసిందని తెలిపారు. మంత్రి సీతక్క చొరవతో 20ఏళ్ల ఉద్యోగుల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసే వారికి కనీసం రూ.10 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. పదేళ్ల నుంచి 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రూ.16 లక్షల గ్రాట్యూటీ పొందే అవకాశం ఉందన్నారు. ఈ మొత్తాన్ని ఉద్యోగ విరమణ పొందిన వారికి అందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీఓ ఉషశ్రీ, వీబీజీ రాంజీ ఉద్యోగులు, ఈసీలు, టీఏలు, సీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement