యాసంగిలో వరి వద్దు | - | Sakshi
Sakshi News home page

యాసంగిలో వరి వద్దు

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

● ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలి

● జిల్లా వ్యవసాయాధికారి సుజాత

యాచారం: వర్షాభావంతో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయని, యాసంగిలో వరి సాగు చేయొద్దని జిల్లా వ్యవసాయాధికారి ఎం.సుజాత రైతులకు సూచించారు. యాచారం రైతు వేదికలో గురువారం ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, సాగు భూమి సంరక్షణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రెండేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో నీటి సమస్యలు తలెత్తుతాయన్నారు. యాసంగిలో వరి పంటను పూర్తిగా ఆపేయాలని సూచించారు. స్వల్ప కాలంలో ఆదాయాన్ని తెచ్చి పెట్టే కూరగాయలు, ఆకుకూరల పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం వరి పంటను కోసిన తర్వాత గడ్డిని రైతులు తగులబెట్టరాదని తెలిపారు. బోరుబావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితో మూగజీవాలకు దాహార్తి తీర్చేందుకు కృషి చేయాలని తెలిపారు. పత్తి తీత పనులు జరుగుతున్న దృష్ట్యా జిల్లాలో పలు చోట్ల సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు నీటి పొదుపు కోసం డ్రిప్‌ విధానాన్ని వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.సురేష్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి ఎండీ రియాజ్‌, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్‌, ఇబ్రహీంపట్నం డివిజన్‌ ఉద్యాన శాఖ అధికారి నవీన, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement